- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాల్వాయి స్రవంతికి 10 వేల ఓట్లు కూడా రావు: సైదిరెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు బైపోల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌ను పాల్వాయి స్రవంతికి ఇస్తే 10 వేల ఓట్లు రావడం కూడా కష్టమేనని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేనన్నారు. అసెంబ్లీ లాబీలో మంగళవారం చిట్ చాట్ నిర్వహించారు. 2018 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిచిన తరువాత ఒక్క రోజు కూడా నియోజకవర్గంలో పడుకోలేదని, అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. రాజగోపాల్ కేవలం కాంట్రాక్టుల కోసం తప్ప ప్రజా సంక్షేమం కోసం ఏనాడూ పాటుపడదలేని విమర్శించారు. రాజగోపాల్ వెంట కాంగ్రెస్ కేడర్, లోకల్ నాయకత్వం రాలేదన్నారు. ఈటల రాజేందర్‌కు ఉన్నంత పలుకుబడి, సెంటిమెంట్ రాజగోపాల్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని బట్టి...కాంగ్రెస్‌కు రెండో స్థానామా? మూడో స్థానామా అనేది తెలుస్తుందన్నారు. స్థానిక లీడర్లు అమ్ముడుపోతున్నారని ప్రజల్లో ప్రచారం బాగా జరుగుతున్నదని, దీంతో వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్‌కు ప్రజల్లో ఆదరణ ఉందని, విజయం తథమని జోస్యం చెప్పారు.