- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షాకు రాజాసింగ్ లేఖ
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో కొత్తగా బట్టబయలైన జీఎస్టీ కుంభకోణాన్ని సీబీఐకి బదిలీ చేయాలని మంగళవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా, తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విభాగంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారిస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్‌లో ఏ5గా రాష్ట్ర మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పేరును పేర్కొన్నారు. తాజాగా ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలిసి జీఎస్టీ పన్ను ఎగవేతదారులకు సహకరించినట్టు అంతర్గత ఆడిటింగ్‌లో అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే సీఐడీ నుంచి సీబీఐకి కేసును అప్పగించాలని రాజాసింగ్ అమిత్ షాను కోరారు.