కేసులు నాకు కొత్తేం కాదు.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
కేసులు నాకు కొత్తేం కాదు.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హనుమాన్ శోభాయాత్రలో బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కావాలనే కుట్రపూరితంగా శోభాయాత్రను ఆలస్యం చేశారని అసహనం వ్యక్తం చేశారు. కేసులు నాకు కొత్తేం కాదని అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గనని ప్రకటించారు. శ్రీరామనవమి రోజున కూడా పోలీసులు ఇలాగే వ్యవహరించారని మండిపడ్డారు. ఆ రోజు పోలీసుల చేసిన ఆలస్యం వల్ల అనేక మంది రామ భక్తులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. వ్యూహాత్మకంగా పోలీసులు తనపై కేసు కూడా నమోదు చేశారని తెలిపారు. కేసులు పెడిగే శ్రీరామనవమి రోజున శోభాయాత్ర తీయబోరు అని పోలీసులు భావించారు కానీ.. వేల కేసులు పెట్టినా భయపడే వ్యక్తులం కాదని అన్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed