- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో పల్లా మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబ సభ్యులపై తీన్మార్ మల్లన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. తన భార్య నీలిమ 1992లోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించిందని.. 2015లో డివిజనల్ ఇంజనీర్‌గా ప్రమోషన్ పొందిందని తెలిపారు. డిప్యూటేషన్‌పై ఆరు నెలలు సచివాలయంలో పని చేసి.. 2020 నవంబర్ 19న వీఆర్ఎస్ తీసుకున్నారని తెలిపారు.
కానీ తన భార్య నీలిమకు బీఆర్ఎస్ ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారని.. తన ఫ్యామిలీపై తప్పుడు ప్రచారం చేస్తోన్న తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజావాణీలో తీన్మార్ మల్లన్న అక్రమాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారని.. కానీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమ అనురాగ్ విద్యాసంస్థలకు వచ్చి తీన్మార్ మల్లన్న సోదరుడు బెదిరిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మల్లన్న మాట్లాడుతున్నాడని పల్లా ఫైర్ అయ్యారు.