TS Assembly : సౌత్ స్టేట్స్‌పై బీజేపీ కోపానికి కారణమిదే.. ఎమ్మెల్యే కూనంనేని

by Rajesh |
TS Assembly : సౌత్ స్టేట్స్‌పై బీజేపీ కోపానికి కారణమిదే.. ఎమ్మెల్యే కూనంనేని
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్రం తాము నిధులు ఇచ్చాం.. ఇచ్చాం అని అనడం సరికాదన్నారు. రాష్ట్రాలు ఇవ్వకపోతే.. కేంద్రానికి నిధులు ఎక్కడ అని ప్రశ్నించారు. కేంద్రం జీఎస్టీ తెచ్చి రాష్ట్రాలను యాచకులుగా మార్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మాత్రమే అన్నారు. కేంద్రం అనేది మిథ్య.. అని ఆనాడ్ ఎన్టీఆర్ అందుకే అన్నారని గుర్తు చేశారు. దేశానికి నేడు రాజనీతిజ్ఞుల కొరత ఉందని కూనంనే అభిప్రాయపడ్డారు.

ప్రజలు చెల్లించిన పన్నులనే మళ్లీ మనం ఖర్చు చేస్తున్నాం కదా అన్నారు. 2014 నుంచి దేశంలో కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువ అయ్యాయన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలు విడిపోవాలి అనే డిమాండ్లు వచ్చేలా పరిస్థితి తయారైందన్నారు. ఈ పరిస్థితులు దేశాని మంచిది కాదని హితవు పలికారు. బీజేపీకి దక్షిణ భారత్ లో సరిగా సీట్లు రావట్లేదు.. ఆ కోపం వాళ్లలో ఉందని అన్నారు. ఇవాళ ఏపీ అవసరం ఉంది కాబట్టే కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. నయా పద్ధతుల్లో కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని తెలిపారు. బొగ్గు, నీళ్లు, ఖనిజం, కరెంట్ ఉన్నప్పటికీ బయ్యారం ఉక్కు పరిశ్రమను ఎందుకు చేపట్టడం లేదని కేంద్రాన్ని నిలదీశారు. గిరిజన యూనివర్సిటీని నామమాత్రంగా ప్రకటించారని నిధులు కూడా ఇవ్వలేదన్నారు.



Next Story