- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Kunamneni: ఎదురుకాల్పులు అన్నీ ప్రభుత్వ హత్యలే.. ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు (Maoists)లపై ఎదురుకాల్పులు అన్నీ ప్రభుత్వ హత్యలేనని సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూలుగు జిల్లా (Mulugu District) చల్పాక (Chalpaka) సమీపంలో మావోయిస్టు(Maoists)లపై జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని ఆరోపించారు. ఆ ఎన్‌కౌంటర్ (Encounter)పై ప్రభుత్వం వెంటనే జ్యుడీషియల్ ఎంక్వైరీ (Judicial Enquiry) వేయాలని, అందుకు సమాధానం కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ గురించి బీఆర్ఎస్ (BRS) పార్టీకి మాట్లాడే అర్హత లేదన్నారు. సింగరేణి (Singareni) కాంట్రాక్ట్ కార్మికులకు (Contract Employees) శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డులు (Ration Cards), పెన్షన్ల (Pensions) ప్రక్రియను సర్కార్ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సాంబశివరావు సూచించారు.