- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన కోమటిరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కాంగ్రెస్ కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన పలు సమస్యలపై సోమవారం వినతి పత్రం అందజేశారు. మునుగోడు నియోజకవర్గంలో 21 కొత్త రూట్లో బస్సులు నడపాలని మంత్రిని రాజగోపాల్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లు మునుగోడు నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. నిధులు కేటాయించకుండా అభివృద్ధిని అడ్డుకుందని అన్నారు. భారత దేశంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి తమ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు. రైతే ప్రధాన లక్ష్యంగా ఖర్చులు తగ్గించి రుణమాఫీ చేసిందని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలని చెప్పారు. ఎలాంటి భేషాజాలు లేకుండా ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని వివరించారు. భవిషత్తులో కూడా రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని తెలిపారు.