సీఎం కేసీఆర్‌తో భేటీపై క్లారిటీ ఇచ్చిన MLA జగ్గారెడ్డి

by Satheesh |   ( Updated:2023-02-09 14:58:57.0  )
సీఎం కేసీఆర్‌తో భేటీపై క్లారిటీ ఇచ్చిన MLA జగ్గారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కొరకు సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో కలసినట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. దళిత బంధు, మెట్రో రైల్​ కొరకు రిక్వెస్ట్​ చేసినట్లు చెప్పారు. గురువారం ఆయన అసెంబ్లీలో ప్రాంగణంలో మీడియాతో చిట్​ చాట్ చేశారు. కేసీఆర్​ మరోసారి అపాయింట్​మెంట్ ఇస్తే ప్రగతిభవన్‌కు వెళ్లి మరోసారి కలుస్తానని చెప్పారు. దీనిలో రాజకీయ ఉద్దేశ్యం ఏమీ లేదన్నారు. కేవలం సంగారెడ్డి డెవలప్​మెంట్ల కొరకు కలవాల్సి వస్తుందన్నారు. 'కాంగ్రెస్‌ ఎంపీలు మోడీని కలిస్తే తప్పులేదు కానీ, నేను సీఎంని కలిస్తే తప్పా? కొత్తగా వచ్చే బదనాం ఏమున్నది? రాహుల్‌ పాదయాత్ర చేసిన రెండు రోజులకే నాపై కోవర్టు ముద్రవేశారు' అంటూ జగ్గారెడ్డి ఫైర్​ అయ్యారు. తన నియోజకవర్గంలో దళితబంధు కొరకు 500 మందికి పైగా పేర్లు ఇచ్చానని చెప్పారు. మహబూబ్ సాగర్ అభివృద్ధి, సిద్దాపూర్‌లో 5 వేలు, కొండాపూర్‌లో 4 వేల ఇండ్ల స్థలాలు, సంగారెడ్డి చెరువులు హెచ్ఎండీఏ పరిధిలో వున్న సమస్యలపై సీఎంతో మాట్లాడినట్లు చెప్పారు. దీంతో పాటు నియోజకవర్గం లో రోడ్లు, డ్వాక్రా గ్రూప్ భవనాలు అభివృద్ధి పనులపై కూడా చర్చించినట్లు వివరించారు.

Also Read..

మంత్రి కేటీఆర్‌తో అసదుద్దీన్ ఒవైసీ భేటీ

ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడుతాం: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed