రైతులకు మాటిచ్చిన ఎమ్మెల్యే.. రూ.3.5 కోట్లతో పనులు ప్రారంభం

by Gantepaka Srikanth |
రైతులకు మాటిచ్చిన ఎమ్మెల్యే.. రూ.3.5 కోట్లతో పనులు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వరదల కారణంగా కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్ట్ పనులను ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రారంభించారు. తక్షణ సాయంగా రూ.3.5 కోట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో శుక్రవారం పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడారు. ఈ ఏడాది ఆయకట్టు వరకూ రైతులకు సాగునీరు అందిస్తామని మాటిచ్చారు. అతి భారీ వర్షం, వరదలతో పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్టకు గండ్లు పడగా అర టీఎంసీ నీరు ఖాళీ అయింది. దీంతో ఈ సీజన్‌లోనే ప్రాజెక్ట్ ఆయకట్టు కింద పంటలు సాగు కోసం తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి సాగునీరు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. నిధులు మంజూరు చేయించే బాధ్యత తనదే అని, రైతులకు సాగునీటి కష్టాలు రాకుండా చూడాలని కోరారు. పెద్దవాగు ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు కోసం సాయం అందించడంలో వెంటనే స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ణతలు తెలిపారు.



Next Story