గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనే ధ్యేయం : మంత్రి నిరంజన్ రెడ్డి

by Nagaya |   ( Updated:2022-12-26 17:39:48.0  )
గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనే ధ్యేయం : మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ,వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో మౌలికవసతుల కల్పన ధ్యేయంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.సోమవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం లో పర్యటించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండల పరిధిలో జగత్ పల్లి, మణిగిల్ల, అమ్మపల్లె, గట్లఖానాపూర్, మంగంపల్లి గ్రామాలలో, పెద్దమందడి మండల కేంద్రంలో ఆరోగ్య ఉపకేంద్రాలు, సీసీ రహదారులు, వాల్మీకి భవనాలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, పాఠశాల అదనపు గదుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలలో మౌళిక వసతుల కల్పన మీద ప్రభుత్వం దృష్టిసారిస్తూ గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి కార్యక్రమాలు ప్రాధాన్యత క్రమంలో చేపడుతుందని అన్నారు. విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రహదారుల నిర్మాణం, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల నిర్మాణం, పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజా ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed