బాసరలో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన మైనర్లు.. పోలీసుల రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-08 02:05:41.0  )
బాసరలో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన మైనర్లు.. పోలీసుల రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాల ప్రభావమో ఏమో ఆ ఇద్దరు మైనర్లు ప్రేమలో పడ్డారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారు. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అంతటితో ఆగకుండా ఏకంగా పెళ్లి చేసుకుందామని బాసరకు వెళ్లారు. ఇద్దరి మతాలు వేరు కావడం, వీరి ప్రవర్తనపై స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ లు ఇద్దరకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే బాసరలో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.



Next Story

Most Viewed