- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కారు’ తొక్కాలనుకుంటే... ‘హస్తం’ అందుకొని అమాత్యులయ్యారు
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ మొండి చేయి ఇచ్చిన నేతలకు కాంగ్రెస్ పెద్ద పీట వేసింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి కొండా సురేఖలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు లభించాయి. దీంతో కార్యకర్తలు, అనుచరుల్లో ఫుల్ జోష్ నెలకొన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఈ నేతలకు కాంగ్రెస్ సర్కార్ ప్రయారిటీ ఇవ్వడం ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
కేసీఆర్ అహంకారానికి బలైన నేతలకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తింపు ఇవ్వడంతో ఆయా లీడర్లు హ్యాపీగా ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్‌లో నష్టపోయిన లీడర్లను కాంగ్రెస్ కండువా కప్పి.. రెడ్ కార్పెట్ వేయడం గమనార్హం. ప్రజాస్వామ్య పరిపాలనతో భాగస్వామ్యం కావాలని ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ఈ నలుగురు నేతలకు సూచించడం విశేషం. ఇక మంత్రి పదవులు అనౌన్స్ తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ఓత్‌కు రావాలని మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న లీడర్లను ఆహ్వానించారు. దీంతో కేబినెట్‌లో ఈ నేతలంతా కీ రోల్ పోషించనున్నారనే టాక్ నెలకొన్నది.
పట్టుబట్టి మెజార్టీ సీట్లు సాధించిన తుమ్మల
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీ పనిచేశారు. టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. రాజకీయ అనుభవంతో పాటు అడ్మినిస్ట్రేషన్‌పై పట్టుంది. అయితే కేసీఆర్ మాత్రం 2023 సార్వత్రిక ఎన్నికల్లో తుమ్మల గ్రాఫ్సరిగ్గా లేదని భావించి టిక్కెట్ నిరాకరించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించేందుకు తుమ్మల తన వంతుగా కృషి చేయడంతో కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది.
చాలెంజ్ నిలబెట్టుకున్న పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. 2018 ఎన్నికలు, ఉప ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేసిన పొంగులేటికి కేసీఆర్ తగిన స్థాయిలో గుర్తింపు ఇవ్వకపోవడమే కాకుండా, తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. పైగా అనుచరులపై నిత్యం కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పొంగులేటి పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు.
దీంతో ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వనని ఛాలెంజ్ విసిరారు. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో 9 సీట్లను కాంగ్రెస్ కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. భద్రాచలం అభ్యర్థి బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచినప్పటికీ.. ఆయన గతంలో పొంగులేటి ఫాలోవర్ కావడం గమనార్హం. దీంతో పాటు వివిధ జిల్లాల్లో పొంగులేటి కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. హైకమాండ్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చి సత్కరించింది.
హస్త రేఖ మార్చుకున్న సురేఖ
మరోవైపు మాజీ మంత్రి కొండా సురేఖ 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. అయితే 2018లో కేసీఆర్ కొండా సురేఖకు టిక్కెట్ ఇవ్వనని తేల్చి చెప్పడంగా ఆమె టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పరకాల అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ రాగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ కేబినెట్‌లొ మంత్రిగా పనిచేసిన సురేఖకు మళ్లీ కాంగ్రెస్ పార్టీ కేబినెట్‌లో స్థానం ఇచ్చింది.
అవమానాలు ఎదుర్కొని..
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయారు. అప్పట్నుంచి కేసీఆర్ తనకు పార్టీలో ప్రయారిటీ ఇవ్వకుండా సమస్యలకు గురి చేశారని స్వయంగా జూపల్లే పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏ 1, 2 హయాంలోనే మంత్రిగా పనిచేసిన జూపల్లికి నిత్యం అవమానాలు ఎదురైనట్లు ఆయన అనుచరులు కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా 2018లో కాంగ్రెస్ తరఫున గెలిచన హర్షవర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి చేర్చుకున్న కేసీఆర్...2023లోనూ అయనకే టికెట్ ఇస్తానని తేల్చి చెప్పారు. దీంతో జూపల్లి కాంగ్రెస్‌లో చేరి విజయం సాధించగా, పార్టీ మరోసారి మినిస్టర్‌ను చేసింది.