ఆమె కోసం సగం క్యాబినెట్ హస్తినకు పయనం.. CM ఆదేశాలతోనే..?

by Satheesh |   ( Updated:2023-03-12 04:12:23.0  )
ఆమె కోసం సగం క్యాబినెట్ హస్తినకు పయనం.. CM ఆదేశాలతోనే..?
X

దిశ,తెలంగాణ బ్యూరో: ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితకు బాసటగా సగం మంత్రులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఆమె ఈడీ ఆఫీసుకు వెళ్లే ముందు వారంతా మనోధైర్యం చెప్పారు. రెండు రోజుల ముందే ఇద్దరు మహిళా మంత్రులు వెళ్లగా.. మిగతా మంత్రులు శుక్ర, శనివారాల్లో చేరారు. మిగిలిన మంత్రులు రాష్ట్రంలో బండి సంజయ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కార్యకర్తలను తరలించే పనిలో బిజీగా ఉన్నట్టు తెలిసింది.

ఢిల్లీకి వెళ్లాలని..

కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్నందున ఆమెకు సపోర్టుగా మంత్రులు ఉండాలని సీఎం కేసీఆర్ ఢిల్లీకి పంపినట్టు తెలిసింది. అందుకే శుక్రవారం పార్టీ కార్యవర్గం సమావేశం ముగిసిన వెంటనే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు బయలుదేరి వెళ్లారు. శనివారం మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ ప్రగతిభవన్ ఆదేశాల మేరకు తరలివెళ్లినట్టు సమాచారం. మంత్రులంతా కలిసి కవితకు ధైర్యం చెప్పినట్టు పార్టీ క్యాడర్‌లో ప్రచారం ఉంది.

కవితతో మాట్లాడిన కేసీఆర్..?

విచారణకు వెళ్లే ముందు కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు న్యాయ నిపుణలతో ప్రత్యేకంగా భేటీ అయినట్టు సమాచారం. ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలి? ఏ విధంగా సమాధానం ఇవ్వాలి? అనే అంశాలపై చర్చించినట్టు తెలిసింది. అలాగే సీఎం కేసీఆర్ కూడా కవితతో ఫోన్లో మాట్లాడి మనోధైర్యం చెప్పినట్టు సమాచారం.

Also Read: బిగ్ న్యూస్: కవిత ఇష్యూ డైవర్ట్ చేసేందుకు మాస్టర్ ప్లాన్.. విచారణ జరుగుతుండగానే నేతలకు ఫోన్ కాల్స్!

Advertisement

Next Story

Most Viewed