అమిత్ షా సభతో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది: మంత్రి వేముల

by GSrikanth |
అమిత్ షా సభతో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది: మంత్రి వేముల
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ నేతలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై బీజేపీ నేతలు దండయాత్రలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభతో రాష్ట్ర జనం ఎటువైపో తేలిపోయిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ను తప్పా మరెవరినీ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. బీజేపీ నేతలకు తెలంగాణ చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన గిరిజన బంధు పథకంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed