- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏప్రిల్ 10లోగా అంబేద్కర్ విగ్రహ పనులు పూర్తి చేయాలి.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ఏప్రిల్ 10 లోగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ పనులు పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మ్యాన్ పవర్ పెంచుకోవాలని, పనులు వేగంగా చేయాలన్నారు. మంగళవారం హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. అదే విధంగా ప్రధాన విగ్రహం,రాక్ గార్డెన్,ల్యాండ్ స్కేప్ ఏరియా ప్లాంటేషన్,మెయిన్ ఎంట్రన్స్,వాటర్ ఫౌంటైన్,సాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సి, గ్రానైట్ ఫ్లోరింగ్,లిఫ్ట్ పనులు,ప్రధాన విగ్రహం వద్దకు వెళ్లే మెట్లు,ర్యాంప్ వర్క్స్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూం,ఫాల్స్ సీలింగ్ పరిశీలించి అధికారులకు, వర్క్స్ ఏజన్సీకి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్14న విగ్రహ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించామన్నారు. పనులు ప్రణాళిక ప్రకారం, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సిందేనని మంత్రి ఆదేశించారు. చరిత్రలో నిలిచే ఇంత గొప్ప కట్టడంలో భాగస్వాములవ్వడం గర్వకారణం అని, కోట్ల హృదయాలను హత్తుకునే ఈ విగ్రహ నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్ బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ లు పాల్గొన్నారు.