- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. ఇక నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ కనిపించదు’
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల నాటికి మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రాథమిక విచారణ నివేదిక తనకు ఇంకా అందలేదని అన్నారు. అతి త్వరలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ప్రకటిస్తామని తెలిపారు. మున్ముందు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి కష్టమే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భ్రమల్లో బతకడం మానేసి.. వాస్తవంలోకి రావాలని హితవు పలికారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో 13 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. మేడిగడ్డ విషయంలో డ్యామేజ్‌కు నిర్దిష్టమైన కారణాలు త్వరలోనే తేలుతాయని చెప్పారు. ఇంజినీరింగ్ డిజైన్ ప్లానింగ్ మొదలు మెయింటెనెన్స్ దాకా ఎక్కడ ఏ స్థాయిలో లోపాలు ఉన్నాయనేది దానికి బాధ్యులు ఎవరు తెలుస్తుందని అన్నారు.