- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రాజెక్ట్ భారీ స్కామ్.. స్వతంత్ర భారత్‌లో ఇంత పెద్ద తప్పిదం ఎప్పుడూ జరగలే: మంత్రి ఉత్తమ్
దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల శాఖను ధ్వంసం చేసిందని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యా్ఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని అన్నారు. సచివాలయంలో శుక్రవారం ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణం.. స్వతంత్ర భారతంలో ఇంత పెద్ద తప్పిదం ఎప్పుడూ జరగలేదని అన్నారు. రాజీవ్ దమ్ముగూడెం-ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ చేపడితే కొత్త ఆయుకట్టుకు నీరందేనని.. కానీ బీఆర్ఎస్ ప్రాజెక్ట్ పేరు మార్చి సీతారామ పేరిట కొత్త ప్రాజెక్ట్ చేపట్టారని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ వ్యయం గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా పెంచిందని ఆరోపించారు.
సీతారామ ప్రాజెక్ట్‌కు రూ.7500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. సీతారామ ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.18 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. దమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్ట్‌లు రూ.1500 కోట్లతో పూర్తి అయ్యేవని.. తద్వారా 3.32 లక్షల ఎకరాలకు నీరందేదన్నారు. ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ పేరుతో అంచనా వ్యయాన్ని రూ.22 వేల కోట్లకు పెంచారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతాలు చేస్తున్నట్లు భ్రమలు కల్పించారని..ప్రాజెక్ట్‌లపై అసెంబ్లీలో అప్పటి సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.