- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Minister Uttam: మోడీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది
దిశ, వెబ్‌డెస్క్: కార్యకర్తల త్యాగాలతోనే రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. ఆదివారం టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పార్టీ బలోపేతం అవుతుందనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. పార్టీలో సుదీర్ఘంగా పని చేస్తున్న వ్యక్తికి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు.
ఇతర పార్టీల్లో ఒకే సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఉంటుంది. కానీ కాంగ్రెస్‌లోనే ఎవరికైనా పార్టీ బాధ్యతలు ఇస్తుందని తెలిపారు. మరోవైపు.. దేశంలో ప్రధాని మోడీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.. వచ్చేసారి అధికారం కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17వ తేదీకి బీజేపీకి ఏం సంబంధం లేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర శూన్యమన్నారు.