- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో హంగ్ వచ్చే ఛాన్సే లేదు: మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ బలమైన పార్టీ అని, రాబోయే ఎన్నికల్లో సింగల్ గానే పోటీ చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తేల్చి చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వామ పక్షాల పొత్తు విషయంపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇస్తారన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మెజార్టీ రావడం ఖాయమని, ఎట్టి పరిస్థితుల్లో హంగ్ వచ్చే ఛాన్స్ లేదన్నారు. ప్రజల దీవెనలతో ఇతర పార్టీల సహకారం లేకుండానే హ్యాట్రిక్ సాధిస్తున్నట్లు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు ఎంత ప్రయత్నించినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇక ఈనెల 17న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తలసాని తెలిపారు. నెక్లెస్ రోడ్సంజీవయ్య పార్కున థ్రిల్ సిటీలో వేడుకలు జరుగుతాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జబర్ధస్త్ ఆర్టిస్టులతో స్కిట్లు ప్రదర్శిస్తామని ఆయన వెల్లడించారు. దీంతో పాటు జంట నగరాల్లో ప్రముఖ ప్రార్ధన మందిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు.