ఈ నెల 24న ‘తెలంగాణ ట్రై క్రీడా వేడుక’.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Javid Pasha |
ఈ నెల 24న ‘తెలంగాణ ట్రై క్రీడా వేడుక’.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 24న ‘తెలంగాణ ట్రై క్రీడా వేడుక’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో మంత్రి కేటీఆర్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నిర్వహించబోయే క్రీడలకు సంబంధించిన తెలంగాణ ట్రై క్రీడా వేడుక వాల్ పోస్టర్ ను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. క్రీడల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో సైక్లింగ్‌, ఇందిరా పార్కులో రోలర్‌ స్కేటింగ్‌ పోటీలు, కేవీబీఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో మహిళల రెజ్లింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులంతా పాల్గొని క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి, మర్రి లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి ఎస్ ఆర్ ప్రేమ రాజ్ , నిర్మల్ సింగ్ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story