నూతన పారిశ్రామిక విధానంలో వారికి ప్రయార్టీ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
నూతన పారిశ్రామిక విధానంలో వారికి ప్రయార్టీ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నూతన పారిశ్రామిక విధానంలో మహిళా పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. హైదరాబాద్ లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్వంలో సూక్ష్మి, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు-సమ్మిళిత అభివృద్ధి అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన పారిశ్రామిక విధానంలో రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తామని ఓఆర్ఆర్ లోపల ఐటీ కంపెనీలకు ప్రాధాన్యత, రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో పరిశ్రమలకు ప్రయార్టీ కల్పిస్తామన్నారు. మిగతా ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను నెలకొల్పుతామని చెప్పారు.



Next Story