- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sridhar Babu: మూసీ ప్రాజెక్ట్‌కు ఇజ్రాయెల్ హెల్ప్.. మంత్రి శ్రీధర్ బాబు హర్షం
దిశ, వెబ్‌డెస్క్: మూసీ(Musi) పునరుజ్జీవనంపై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సచివాలయంలో ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్‌తో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ణానం అందించడానికి ఇజ్రాయెల్ సిద్ధం కావడం పట్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఆసక్తి కనబర్చడం సంతోషంగా ఉందని అన్నారు. కృత్రిమ మేథ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణాకు సహకరించాలని శ్రీధర్ బాబు రిక్వెస్ట్ చేశారు.
డిఫెన్స్, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక సాంకేతికత, నూతన పరిశోధనలు, పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని మంత్రి చేసిన విజ్ఞప్తికి రువెన్ అజర్ సానుకూలంగా స్పందించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రాజెక్టుల గురించి ఆయనకు వివరించారు. నూతన పరిజ్ణానం, పరిశ్రమల ఏర్పాటులో సాయపడితే ఇక్కడి నుంచే ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని సూచించారు.