- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Sridhar Babu : కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: అతి తెలివి మంత్రి గారు.. మీ లాజిక్ ప్రకారం మీ చిట్టి నాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి శ్రీధర్ బాబుపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోందని కేటీఆర్‌కు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఆయన పెద్దపల్లి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. నేను అన్న మాటలు కావు అవి.. ఆ పార్టీ ఎమ్మెల్యేనే అరికెపూడి గాంధీయే తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారని చెప్పుకొచ్చారు.
మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్లు మేము తలదూర్చము.. అని వ్యాఖ్యానించారు. మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. మా పార్టీ నెపం వేయడంపై ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారని ప్రత్యక్ష్యంగా చెబుతూనే ఉన్నామని అన్నారు. ఎవరు తెలివిగల వారో ప్రజలే చెప్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉంటున్న వారంత తెలంగాణ వారేనని, తెలంగాణకు సంబంధించిన ప్రజలని అన్నారు. వారందరనీ కూడా గౌరవించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.
మరోవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని తేవాలని ప్రయత్నం జరుగుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచడానికి అందరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. కానీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఏది ఏమైనా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుతామని, బ్రాండ్ ఇమేజ్‌ను పదింతలు పెంచే ప్రయత్నం చేస్తామని అన్నారు.