భారీ వర్షాలపై మంత్రి సీతక్క సమీక్ష.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

by Mahesh |   ( Updated:2024-09-04 15:30:03.0  )
భారీ వర్షాలపై మంత్రి సీతక్క సమీక్ష.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains)పై మంత్రి సీతకక్క అధికారులతో టెలికాన్ఫరెన్స్‌(Teleconference) ద్వారా సమిక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరికలు జారీ చేయడంతో మంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా.. రహదారుల పునరుద్ధరణపై మంత్రి సీతక్క(Minister Sitakka) సూచనలు ఇచ్చారు. అలాగే ఈ పనులకు సంబంధించి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేస్తామని మంత్రి అధికారులతో తెలిపారు. మండలానికి ఐదుగురితో ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్ కమిటీ(Flood Management Committee)ని ఏర్పాటు చేయాలని.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed