- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్.. గొంతు పెంచి మాట్లాడితే అబద్ధం నిజం కాదు: మంత్రి సత్యవతి రాథోడ్
దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ రెడ్డికి సోయి ఉంటే, చేతనైతే కేంద్రంపై పోరాటం చేయాలని మంత్రి సత్యవతి రాధోడ్ సూచించారు. రేవంత్ రెడ్డి గొంతుపెంచి మాట్లాడితే అబద్ధం నిజం కాదని స్పష్టం చేశారు. మంగళవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా కేంద్రం గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ కన్నా.. తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు. బీజేపీకి ప్రేమంతా ఎన్నికలు, అధికారంపైనేనని, పేదలపై లేదన్నారు. మేడారం జాతరకు బీఆర్ఎస్ నాలుగేళ్ల పాటు ఇచ్చిన నిధులు.. కాంగ్రెస్ జీవితకాలంలో ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ను పాతాళం లోకి తొక్కడం కాదు.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోకుండా చూసుకోవాలని హితవు పలికారు. సమయం వచ్చినప్పుడు గిరిజన బంధు ఇస్తాం అని, సీఎం కేసీఆర్‌కు గిరిజనులంటే ఇష్టం అన్నారు.
పోడు భూములు త్వరలోనే పంపిణీ చేయబడుతాయన్నారు. కేంద్రం గిరిజనుల పట్ల అక్కసు కక్కడం మానుకోవడం లేదని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా మళ్లీ అబద్ధాలు ప్రకటించారని ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీ ప్రతిపాదన అందలేదని పార్లమెంట్లో కేంద్రమంత్రి ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. గిరిజన యూనివర్సిటీ అనేది విభజన చట్టంలోనే ఉందని స్పష్టం చేశారు. గిరిజన యూనివర్సిటీ కోసం నోడల్ ఏజెన్సీగా సెంట్రల్ యూనివర్సిటీని నియమించిందని, 2017లోనే ములుగు జిల్లా దగ్గర 170 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. హెచ్ఆర్డీ ద్వారా భూమి ఉందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయన్నారు. 2021, 22లో పార్లమెంట్ సెషన్స్‌లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగినప్పుడు ప్రతిపాదనలు ఉన్నాయని కేంద్రమే ప్రకటించిందన్నారు.
తెలంగాణకు యూనివర్సిటీ రాకుండా బీజేపీ కక్షకట్టిందని, ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి అసత్య ప్రకటన చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీకి కేసీఆర్‌పై కోపమా? తెలంగాణ ప్రజలపై కోపమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి జాతీయస్థాయిలో ఏమైనా పోటీ వస్తదని అబద్ధపు ప్రకటన చేశారా? అని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం గిరిజనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసును సీబీఐకి అప్పగించినా భయం లేదని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, హరిప్రియ నాయక్ ఉన్నారు.