- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యంత కీలకమైన సమావేశానికి మంత్రి సబితా డుమ్మా!
దిశ, డైనమిక్ బ్యూరో: కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కీలక సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డుమ్మా కొట్టారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ అధ్యక్షతనే ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్, బోర్డు అధికారులు, కాలేజీల యాజమాన్యాలు బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఇటీవల సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య ఘటన ఇంటర్, పోటీ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమీక్షలో చర్చించారు.
మొత్తం 14 కార్పొరేట్ కాలేజీలకు అధికారులు ఆహ్వానం పంపించగా అత్యంత కీలకమైన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దూరంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు విద్యార్థులు పిట్టల్లా రాలుతుంటే మరో వైపు కీలక సమావేశానికి సబితా గైర్హాజరు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. అయితే ముందుగా అనుకున్న జిల్లా పరిషత్ సమావేశం ఆలస్యం కావడం వల్లే ఈ మీటింగ్‌కు మంత్రి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.