- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నీరాకేఫ్‌పై రాజకీయం అనవసరం.. సీఎం ఆ బాధ్యత మాకే ఇచ్చారు: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: ట్యాంక్ బండ్ మీద సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి స్థలం విషయంలో నిన్ననే తాను, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కలిసి సీఎంతో మాట్లాడినట్లు మంత్రి పొన్నం (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్‌బండ్‌పై గతంలో చూసిన స్థలం కానీ వేరే స్థలాన్ని చూసే బాధ్యత సీఎం మా ఇద్దరికే అప్పగించారని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud) విగ్రహం, గౌడ సంఘం భవనం, (Neera Cafe) నీరాకేఫ్ అంశాలపై మినిస్టర్ క్వార్టర్స్‌లో గౌడ సంఘాల నేతలు తనను కలిసినట్లు వెల్లడించారు. ఈ మార్చి తర్వాత గౌడ సంఘం భవన నిర్మాణానికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆనాడు శ్రీనివాస్ గౌడ్ (V. Srinivas Goud) ఒక ఆలోచన చేసి నీరా కేఫ్ ఏర్పాటు చేసి ఉండొచ్చు.. కానీ ఇప్పుడు దీనిపై రాజకీయం చేయడం అనవసరమని పేర్కొన్నారు.
తాము కుల ప్రతినిధులుగా కులానికి సంబంధించిన విషయంలో బాధ్యతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆనాడు నీరాకేఫ్ కట్టే సందర్భంలో గీతా పారిశ్రామిక కార్పొరేషన్‌కు దాని హక్కులు అప్పగిస్తే నేడు ఇబ్బందులు ఉండకపోయేదని అభిప్రాయపడ్డారు. సగం సగం చేయడం వల్ల ఈ రోజు ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ఎండీ నీరాకేఫ్ స్థలం టూరిజం శాఖది అని స్పష్టం చేశారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చేసుకొని నీరాకేఫ్‌ను పూర్తి స్థాయిలో గీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
గౌడ పెద్దలు గమనించండి.. నేను, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి మేము మీ ప్రతినిధులం.. మీకు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎవరు ఏం చేశారు అనేది చర్చ అవసరం లేదన్నారు. గతంలో చేసిన వారిని గౌరవించుకుంటూనే బాధ్యత గల వ్యక్తులుగా కులానికి సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పారు. నీరాకేఫ్‌కి సంబంధించి ఎవరెన్ని సమావేశాలు పెట్టుకున్న భవిష్యత్తులో ఇది గీత పారిశ్రామిక కార్పొరేషన్ సంస్థకు అందుతుందని స్పష్టం చేశారు.