- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.2 లక్షల రుణమాఫీ అతిపెద్ద సాహసం: మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసకక్తిర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.2 లక్షల రుణమాఫీ అమలు అతిపెద్ద సాహసం అని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న రుణమాఫీతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రేపటి (బుధవారం) నుండి రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని తెలిపారు.
కాగా, తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్.. రైతు రుణ మాఫీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 18వ తేదీ నుండి రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 18న రూ.లక్ష లోపు పంట రుణం ఉన్న రైతులకు లోన్ మాఫీ చేయనుంది. అనంతరం విడతల వారీగా ఆగస్ట్ 15 నాటికీ రుణమాఫీ ప్రక్రియను కంప్లీట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.