- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గల్ఫ్ బాధితుల కోసం ‘ప్రవాసి ప్రజావాణి’.. ప్రారంభించిన మంత్రి పొన్నం
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా భవన్ వేదికగా వారానికి 2 రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విపరీతైన స్పందన కూడా లభించింది. దీంతో ఇప్పుడు మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలంగాణ సర్కార్.
ఈ ప్రోగ్రాం ద్వారా గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి పేరుతో ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈ కార్యక్రమం ప్రజావాణి కార్యక్రమం తరహాలోనే వారినికి రెండు రోజులు అంటే (బుధ, శుక్ర) వారాల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ప్రారంభించారు. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సమస్యల పరిష్కారానికి దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో కౌంటర్ తెరిచి ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ విషయాన్ని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్ కుమార్ వెల్లడించారు.