317 జీవో.. స్థానికత్వం కేంద్ర పరిధిలోనిది.. బండి సంజయ్‌కి మంత్రి పొన్నం కౌంటర్

by Ramesh N |
317 జీవో.. స్థానికత్వం కేంద్ర పరిధిలోనిది.. బండి సంజయ్‌కి మంత్రి పొన్నం కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: 317 జీవో (GO 317) అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎక్స్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం తెచ్చిన 317 జీవోపై బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) ప్రస్తావిస్తున్నారని మంత్రి అన్నారు. 317 జీవో సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌజ్ కేసులు గానీ, హెల్త్, మ్యూచువల్‌కి సంబంధించిన వారిని ట్రాన్స్ఫర్ చేసినట్లు స్పష్టం చేశారు. స్థానికత్వం అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని, దానికి సంబంధించి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించి నివేదిక ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.

ఉద్యోగులు, నిరుద్యోగులరా ఇది కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం బాధ్యత అని తెలియజేశారు. 317 సమస్య పరిష్కారం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని గుర్తుకు చేశారు. జీవో విషయంలో ఈ రోజు కూడా మా మీద విశ్వాసం ఉంచండని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దాని మీద మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha) నాయకత్వంలో శ్రీధర్ బాబు (Sridhar Babu), నేను 317 జీవో పైన అనేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు గుర్తుకు చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా బాధ్యత నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని ఎన్నికల్లో రాజకీయాలకు ఉపయోగించుకోవడం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారంలో ఉన్నాం మా బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుకూలంగా ఉండేలా చేసేలా బాధ్యత మాది.. అని వెల్లడించారు.

Next Story