- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Ponnam: ఆ పని చేసిన రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసింది.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: కులగణన (Cast Census) రిపోర్టును తెలంగాణ సర్కార్ (Telangana Government) అసెంబ్లీ (Assembly)లో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీ సభ్యుల ఓ రేంజ్‌లో మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కులగణన (Cast Census) నివేదికను బేస్ చేసుకుని ప్రభుత్వం ఏం చేయబోతోంది.. భవిష్యత్తు కార్యాచరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యంగా బీసీ (BC) కులగణనతో భవిష్యత్తు కార్యాచరణకు రోడ్ మ్యాప్ (Road Map) పడిందని కామెంట్ చేశారు. 2011 తర్వాత జనగణన చేపట్టలేదని అన్నారు. విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా సమగ్ర సర్వేలలో ఎలాంటి తప్పులు చేయలేదని.. తప్పుడు లెక్కలను చెప్పడం లేదని ఫైర్ అయ్యారు.
ఒకవేళ బీసీ(BC)ల అభవృద్ధికి ఎవరు సలహాలు ఇచ్చిన సంతోషంగా స్వీకరిస్తామని అన్నారు. దేశంలో కులగణన చేసిన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిందని ఆరోపించారు. తెలంగాణ (Telangana) కులగణనలో సుమారు లక్ష మంది ఉద్యోగులు పాల్గొన్నారని గుర్తు చేశారు. ఇప్పటికీ బీసీ (BC)లకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కులగణన సర్వే Cast Census Survey) విషయంలో ప్రతిపక్షాలు ప్రజల్లో లేనిపోని అనుమానాలను రేకెత్తించడం మానుకోవాలని హితవు పలికారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు అన్యాయం జరగనివ్వబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
కాగా, రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ నివేదికపై సభ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేయగా మంత్రులు సహా, సీఎం వారి అనుమానాలకు స్పష్టత ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే తీర్మానానికి ఆమోదం తెలపాలని పిలుపునిచ్చారు. దీంతో సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఆమోదం తెలిపింది. దీంతో కులగణన నివేదికకు చట్టబద్ధత వచ్చినట్లైంది. ఆ లెక్కల ఆధారంగా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రకటించారు.