Minister Ponguleti:ఇందిరమ్మ ఇళ్ల పథకం పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Jakkula Mamatha |   ( Updated:2024-09-24 06:37:32.0  )
Minister Ponguleti:ఇందిరమ్మ ఇళ్ల పథకం పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విధివిధానాలు వారం రోజుల్లో రూపొందిస్తామన్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు అందించే విషయం పైన త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ సాగర్ ఎడమ కాలువకు ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున అధికారులు నీటిని విడుదల చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం రిజర్వాయర్ వద్ద గండిపడ్డ ప్రాంతాలను పరిశీలించారు. సెప్టెంబర్ 1న కురిసిన వర్షాలకు, వరద తాకిడికి కాలువకు గండి పడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed