Ponguleti : ఓ విదేశీ కంపెనీ చేతుల్లో తెలంగాణ భూమి.. ‘ధరణి’పై మంత్రి పొంగులేటి కీలక విషయాలు

by Ramesh N |
Ponguleti : ఓ విదేశీ కంపెనీ చేతుల్లో తెలంగాణ భూమి.. ‘ధరణి’పై మంత్రి పొంగులేటి కీలక విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘ధరణి’ చట్టంలో ఆనాటి ప్రభుత్వం చేసిన తప్పుల ఫలితమే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావడానికి కారణమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రముఖ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో మట్లాడారు. ధరణి పోర్టల్‌ని ఆ నాటి ప్రభుత్వం వారి సన్నిహితంగా ఉండే ఒక విదేశీ కంపెనీకి బాధ్యతలు ఇచ్చారని తనకు అధికారులు తెలిపారని అన్నారు. సుమారు 1 కోటి 50 లక్షలపైగా తెలంగాణ భూమిని ఆనాటి ప్రభుత్వం ఒక విదేశీ కంపెనీ చేతిలో పెట్టిందని ఆరోపించారు. ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పిన ఆనాటి పెద్దలు.. పరిష్కారం కాకపోవడం అటుంచితే సమస్యలు వంద రెట్లు పెరిగాయన్నారు.

ధరణి చట్టంలో కొన్ని లొసుగులతో సామాన్య రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. గత చట్టంలో ఏదైనా సమస్యలు ఉంటే రెవెన్యూ కోర్టులు, ఆర్డీవో, ఎమ్మార్వో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఐ కోర్టులో పరిష్కారం అయ్యేదని గుర్తుచేశారు. రెవెన్యూ చట్టం 2020లో ఆ ప్రొసిజర్ తీసీవేశారని, దీంతో రైతులకు సమస్యగా మారిందన్నారు. ఎన్నో లక్షల అప్లికేషన్‌లు పెండింగ్‌లోనే ఉన్నాయని, తమ ప్రభుత్వం వచ్చాక కొన్నింటిని పరిష్కరిస్తున్నామని చెప్పారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. భూ సమస్యలపై పరిష్కారానికి రెండు మండలాల్లో ఆర్వోఆర్ చట్టం పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నామని వివరించారు.

హైడ్రా పనితీరు భేష్..

స్టాంపులు-రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలో అవినీతిని సహించమని తెలిపారు. అవినీతి అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని వెల్లడించారు. మరోవైపు నిబంధనలకు లోబడే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొదటి ప్రాధాన్యత పేదలేనని స్పష్టంచేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఎవరినీ ఉపేక్షించమన్నారు. హైడ్రా పనితీరు ప్రశంసలు కురిపించారు. జిల్లా కేంద్రాల్లో కూడా హైడ్రా వంటి వ్యవస్థలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story