- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాకు మంత్రి కేటీఆర్.. అప్పటి వరకు అక్కడే!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వేదిక పైన తెలంగాణ సాధించిన జలవిజయాన్ని చాటేందుకు మంత్రి కేటీఆర్ మంగళవారం అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నెల చివరివారం వరకు అక్కడే ఉండనున్నారు. తిరిగి ఈ నెల 29న హైదరాబాద్కు రానున్నట్లు సమాచారం. సీఎం మార్గదర్శనంలో నిర్మాణమైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం, ఇంటింటికి సురక్షిత మంచినీరు అందిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ఫలితాలను అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని హెండర్సన్ నగరంలో జరుగుతున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ - వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసేందుకు సంస్థ ఆహ్వానం మేరకు వెళ్లారు.
సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రణాళికల గురించి 2017లో అమెరికా శాక్రమెంటో వేదికగా జరిగిన ఏఎస్సీఈ సదస్సులో కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ భారీ సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలు, అందరికీ సురక్షిత తాగునీరు అందించే మిషన్ భగీరథ లాంటి బృహత్ పథకాల గురించి వివరించినప్పుడు ఏఎస్సీఈ ఆశ్చర్యం వ్యక్తం చేసిన తర్వాత 2022లో తెలంగాణలో పర్యటించింది.
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రత్యేకంగా సందర్శించిన ఆ సంస్థ ప్రతినిధుల బృందం, తెలంగాణ సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ గేమ్ ఛేంజర్ అని ప్రశంసలు అందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును స్వల్ప కాలంలోనే పూర్తి చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన అమెరికన్ సివిల్ ఇంజనీర్స్ సొసైటీ సంస్థ, ఆ విజయగాథను, తెలంగాణ ప్రభుత్వ ఘనతను అమెరికాలో వివరించేందుకు రావాలని ప్రత్యేకంగా కేటీఆర్ కు ఆహ్వానం పంపించింది.
అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి హాజరయ్యే సివిల్ ఇంజనీర్ల సమక్షంలో కేటీఆర్ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, దాని ద్వారా అందుతున్న ఫలాలు, ఇతర ప్రణాళికలను ఒక ప్రజెంటేషన్ రూపంలో అందించనున్నారు. కాళేశ్వరంతో పాటు మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నీరు అందించిన విధానం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో వచ్చిన సామాజిక ఆర్థిక ప్రగతిని మంత్రి వివరించనున్నారు.
ఒకప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణ, నేడు పచ్చని పంటలతో కళకళలాడడానికి కేసీఆర్ ఈ నేలపై ఉన్న మమకారం, అపార జ్ఞానం, ముందుచూపే కారణమని కేటీఆర్ తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పలు కంపెనీలతో ఈ నెల చివరి వారం వరకు సమావేశం కానున్నారు.