- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎగిరిన గులాబీ జెండా.. పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు
దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహించిన పార్టీ యంత్రాంగానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన సభలను ఒక ఆత్మీయ వాతావరణంలో క్రమశిక్షణతో నిర్వహించడంలో కీలక పాత్ర వహించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు, పార్టీ పరిశీలకులను అభినందించారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జనావాసాల్లో గులాబీ పతాకాన్ని ఎగురవేసి.. జెండా పండుగను సంబరంగా నిర్వహించిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ప్రతినిధుల సభ ద్వారా దాదాపు 4 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాల విషయంలో ఒక గొప్ప నిర్మాణాత్మక సందేశం అందిందని అభిప్రాయపడ్డారు.
పార్టీ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించిన తరహాలో.. ఇలా ఒకేరోజు పకడ్బందీగా నాలుగు లక్షల మంది కార్యకర్తలను కలుపుకుంటూ 119 నియోజకవర్గాల్లో ఇంత భారీగా సమావేశాలు నిర్వహించిన అంశం, దేశ రాజకీయ చరిత్రలో ఒక అరుదైన మైలురాయి అన్నారు. ఈ సమావేశాల ద్వారా తీర్మానాల రూపంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైన విస్తృతమైన చర్చ జరిగిందని, దీంతోపాటు బీజేపీ కేంద్ర ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలు కూడా కూలంకషంగా చర్చకు వచ్చాయన్నారు. ఎన్నికల సంవత్సరమైనందున సమావేశాల్లో అందుకున్న సందేశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా.. పార్టీ శ్రేణులు తీసుకెళ్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రతినిధుల సభ స్ఫూర్తితో బీఆర్ఎస్ పాలన విధానాలను, సీఎం నాయకత్వ పటిమను, వాటి ద్వారా అందుతున్న ఫలాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని, ఇదే స్ఫూర్తితో పనిచేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.