- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అదానీ మోసాలపై మాట్లాడే దమ్ము లేదు.. బీజేపీ నేతలపై మంత్రి KTR సెటైర్లు
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. అదానీ కుంభకోణం, హిండెన్‌బర్గ్ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము కూడా లేదు గానీ, అదానీ మోసాలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలంటూ బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన కామెంట్స్‌పై మాత్రం ఉలిక్కి పడుతున్నారు అని బీజేపీ నేతలను ఉద్దేశించి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు. 'అదానీ కుంభకోణం గురించి, హిండెన్ బర్గ్ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము లేదు.
కానీ, బిలియనీర్ జార్జ్ సోరోస్ కామెంట్స్ చేయగానే, వారి గురువును కాపాడుకునేందుకు చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత బుద్ధి తక్కువ మనుషులు' అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అదేవిధంగా, 'నా వ్యాఖ్యలు ఎవరి గురించో ఊహించండి ?' అంటూ నెటిజన్లకు కేటీఆర్ ప్రశ్న వేశారు. దానికి 'ప్యాట్రియాటిజమ్ ఈజ్ ద లాస్ట్ రెఫుగీ ఆఫ్ ద స్కౌండ్రల్ (ద్రోహులకు దేశభక్తే ఆఖరి రక్ష)' అన్న సామ్యేల్ జాన్సన్ సూక్తిని జతచేశారు.