అన్యాయం చేసిన ఎవడినీ వదలిపెట్టం.. ప్రీతి మృతిపై కేటీఆర్

by GSrikanth |
అన్యాయం చేసిన ఎవడినీ వదలిపెట్టం.. ప్రీతి మృతిపై కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రీతి ఆత్మహ‌త్య విష‌యంలో ప్రతిప‌క్షాలు రాజ‌కీయాలు చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన స‌భ‌లో వరంగల్ కేఎంసీ వైద్యవిద్యార్థిని ప్రీతి మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్యాయం చేసిన వాడు సైఫ్ అయినా, సంజ‌య్ అయినా, ఎవ‌డైనా స‌రే వ‌దిలిపెట్టమని.. చ‌ట్టప‌రంగా శిక్షిస్తామ‌ని స్పష్టం చేశారు. ప్రతి చిన్న అంశాన్ని రాజ‌కీయం చేస్తున్నారని మండిప‌డ్డారు.

ప్రీతి దుర‌దృష్టావ‌శాత్తూ కాలేజీలో జ‌రిగిన గొడ‌వ‌ల్లో మ‌న‌స్తాపానికి గురై చ‌నిపోగా.. ఆ అంశాన్ని కూడా రాజ‌కీయం చేసేందుకు ప్రయ‌త్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ప్రీతి మరణం అంద‌రినీ కలచివేసిందన్నారు. ప్రీతి కుటుంబానికి త‌మ పార్టీ, ప్రభుత్వం త‌ర‌ఫున మ‌న‌స్ఫూర్తిగా సంతాపం ప్రక‌టిస్తున్నామన్నారు. కొంతమంది రాజ‌కీయంగా చిల్లర‌ మాట‌లు మాట్లాడొచ్చు.. కానీ ప్రభుత్వం, పార్టీ ప‌రంగా ఆ కుటుంబానికి తాము అండ‌గా ఉంటాం అని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed