పవన్ కల్యాణ్‌పై మంత్రి KTR ఆసక్తికర వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-28 09:07:22.0  )
పవన్ కల్యాణ్‌పై మంత్రి KTR ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్, హీరో పవన్ కల్యాణ్‌పై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తనకు పవన్ మంచి ఫ్రెండ్ అని, అన్న లాంటి వాడన్నారు. పవన్ కల్యాణ్‌తో అనేక విషయాలపై మాట్లాడుకున్నామని తెలిపారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ పవన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పవన్‌కు సాహిత్యం అంటే ఇష్టమని చెప్పిన కేటీఆర్.. తనకు కూడా సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ అన్నారు. ఏపీలో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. నారా లోకేష్ బాగా తెలుసని, జగనన్న మంచి ఫ్రెండ్ అన్నారు. కేంద్రంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ మాత్రమే ఏపీ ప్రయోజనాలను కాపాడగలరన్నారు. అయితే పవన్ కల్యాణ్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed