చిల్లర రాజకీయాల కోసమే ప్రధాని పర్యటన.. మంత్రి కేటీఆర్ ఫైర్

by Javid Pasha |
చిల్లర రాజకీయాల కోసమే ప్రధాని పర్యటన.. మంత్రి కేటీఆర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రం పేరు చెప్పాలంటూ ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి ప్రధాని ఒక్క మాట కూడా మెచ్చుకోలేదని, కేవలం చిల్లర రాజకీయాల కోసమే ఆయన హైదరాబాద్ పర్యటనకు వచ్చారని ఆరోపించారు. నిన్న హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్​ను ఉద్దేశిస్తూ పరోక్షంగా బీఆర్​ఎస్ సర్కార్​పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రధాని మోడీ పర్యటనపై మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు.

గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణతో సమానంగా వృద్ధి సాధించిన రాష్ట్రాన్ని చూపాలని ప్రధానికి సవాల్‌ విసిరారు. దేశంలోనే తెలంగాణ అత్యధిక తలసరి వృద్ధి కలిగిన రాష్ట్రమన్న మంత్రి కేటీఆర్.. ఇంటింటికీ తాగునీరు అందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయటంతో పాటు.. దేశంలో ఉత్తమ గ్రామీణ అభివృద్ధి నమూనా కలిగి వంద శాతం ఓడీఎఫ్ ప్లస్‌ని సాధించామన్నారు. దేశంలోనే అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పునరుద్ఘాటించారు. యువతకు ఉద్యోగ కల్పనలో ముందంజలో ఉన్నామన్నారు.

తెలంగాణలో గ్రీన్ కవర్ వృద్ధి 7.7 శాతంగా ఉందన్న కేటీఆర్.. అత్యధిక అవార్డులు అందుకున్న రాష్ట్రంగా తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. భారత జీడీపీ వృద్ధిలో సహకారం అందిస్తున్న 4వ ముఖ్యమైన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్న మంత్రి కేటీఆర్... దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం, అతిపెద్ద టెక్ట్స్​టైల్ పార్క్, ప్రపంచ వ్యాక్సిన్ హబ్​లు తెలంగాణ ప్రత్యేకతలన్నారు. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి ప్రధాని మోదీ నోటి నుంచి ఒక్క మాట కూడా మెచ్చుకోలేదని రాలేదని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం అత్యుత్తమ పర్ఫార్మింగ్ రాష్ట్రంగా తెలంగాణను ప్రధాని అంగీకరించలేకపోతున్నారన్నారంటూ ట్విటర్​ వేదికగా మంత్రి కేటీఆర్ విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed