ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ సవాల్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-12 03:09:59.0  )
ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తొమ్మిదేళ్ల అభివృద్ధిపై చర్చకు రావాలని ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రులెవరైనా చర్చకు రావాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందన్నారు. తెలంగాణపై అంసతృప్తితో అసత్యాలు ప్రచారం చేయవద్దన్నారు. బీజేపీ నేతల అసమర్థతను తెలంగాణపై రుద్దవద్దన్నారు. ఈ మేరకు తెలంగాణ సాధించిన పలు అభివృద్ధి పథకాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ట్వీట్ ను నరేంద్రమోడీకి జత చేశారు.

Advertisement

Next Story

Most Viewed