- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ అభ్యర్థులపై ఇంటర్నల్ సర్వే.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక్‌సభ అభ్యర్థులపై ఇంటర్నల్ సర్వే జరుగుతోందని అన్నారు. భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీని కోరామని చెప్పారు. భువనగిరి, నల్లగొండ, ఖమ్మం నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సౌత్ ఇండియాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతను తాము తీసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం యాదాద్రి పేరు మార్పుపైనా స్పందించారు. ఇక నుంచి యాదాద్రి కాదని.. యాదగిరిగుట్టగానే పరిగణిస్తామని అన్నారు. అతి త్వరలో యాదగిరిగుట్టగా మారుస్తూ జీవో విడుదల చేస్తామని తెలిపారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకని సెటైర్ వేశారు. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే హరీష్ రావు కూడా బీజేపీలో చేరేవారని అన్నారు.