- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ వేసిన మొదటి తప్పటడుగు ఇదే.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. క్లిష్ట సమయంలో వరుసగా కీలక నేతలంగా పార్టీని వీడుతున్నారు. కొందరైతే ఇచ్చిన టికెట్‌ను కూడా కాదనుకొని ఇతర పార్టీల్లో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయన మెడకు చుట్టుకుంటున్నాయని అన్నారు.
యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చడమే ఆయన చేసిన మొట్ట మొదటి అని ఎత్తిచూశారు. యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తాం అని ప్రకటించారు. కేసీఆర్ చేసిన పాపాల వల్ల రాష్ట్రంలో కరువు వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే వర్షాల కోసం ఎదురుచూసే పరిస్థితే గతంలో ఉండకపోయేది. కాంగ్రెస్ అంటేనే వర్షం అని అన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గందరగోళం చేశారని ఆరోపించారు. తాము ఇంకా అన్ని గేట్లు తెరవలేదు. ఒక్క గేట్ తెరిస్తేనే ఇంతమంది వచ్చి చేరుతున్నారు అని ఎద్దేవా చేశారు.