- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నిటికంటే భయంకరమైన వ్యాధి అదే.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, సమాజానికి హానికరమైన మాదక ద్రవ్యాల చలామణిని అడ్డుకుందామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం - సమాజాన్ని మేలుకొలుపుదాం అనే పేరుతో చేపట్టిన కళాయాత్రను మంత్రి జూపల్లి.. జెండా ఊపి ప్రారంభించారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు హైదరాబాద్‌తో పాటు నగర శివారులోని హైస్కూల్స్, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పీజీ కాలేజీల్లో కళా ప్రదర్శన ద్వారా డ్రగ్స్ గురించి, దాని వల్ల కలిగే దుష్ప్రభావాల పట్ల అవగాహన కల్పించనున్నట్లు నిర్వహకులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. సమాజ మార్పులోనూ, నవ సమాజ నిర్మాణంలోనూ యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మత్తు అనే మహమ్మారికి యువత బానిసలుగా మారొద్దని, తాత్కాలిక ఉపశమనం కోసం భవిష్యత్తు అంధకారం చేసుకోకూడదని సూచించారు. మాదక ద్రవ్యాలు మనుషుల జీవితాలను నాశనం చేస్తాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్లకు ఆకర్షితులు కావొద్దని కోరారు.
మాదక ద్రవ్యాల వినియోగమే సమాజంలో అన్నిటికంటే భయంకరమైన వ్యాధి అని అభివర్ణించారు. చాపకింద నీరులా అది వ్యాప్తి చెందకుండా ముందస్తుగా అప్రమత్తం కావాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీల్లో చేరి సైనికులుగా పనిచేస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ప్రజానాట్య మండలి నిర్వహకులను, కళాకారులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి ఆహ్వాన సంఘం సలహాదారు డీజీ నర్సింహారావు, కార్యదర్శి నాగటి మారన్న, తదితరులు పాల్గొన్నారు.