ఎక్సైజ్ అధికారుల తీరుపై మంత్రి జూపల్లి ఫుల్ ఫైర్

by Satheesh |
ఎక్సైజ్ అధికారుల తీరుపై మంత్రి జూపల్లి ఫుల్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎక్సైజ్ అధికారుల తీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫుల్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఎక్సైజ్ శాఖపై సంబంధిత అధికారులతో జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం కంపెనీలకు అనుమతుల విషయంలో తన దృష్టికి రాకుండా నిర్ణయాలు తీసుకున్న అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బెవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. కొందరి సొంత నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది మారిందని అసహనం వ్యక్తం చేశారు. ఏ నిబంధనలు ప్రకారం కొత్త నిర్ణయాలు తీసుకున్నారో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story