Minister Jagadish Reddy : మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక నిర్ణయం.. డిస్మిస్ ఆర్టిజన్లు విధుల్లోకి

by GSrikanth |   ( Updated:2023-05-23 12:08:01.0  )
Minister Jagadish Reddy :  మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక నిర్ణయం.. డిస్మిస్ ఆర్టిజన్లు విధుల్లోకి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో సమ్మె సందర్భంగా విధులకు గైర్హాజరైనందుకు సర్వీసు నుంచి తొలగించిన 196 మంది ఆర్టిజన్లను తిరిగి చేర్చుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సమ్మె నోటీసు తర్వాత జరిగిన చర్చలతో కొన్ని డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ట్రాన్స్ కో – జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసినా గైర్హాజరైనందుకు 196 మందిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వీరిని రెగ్యులరైజ్ చేయనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఆ హామీ నెరవేరకపోవడంతో సమ్మె చేయడానికి ఇచ్చిన నోటీసులో దీన్ని ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఒక డిమాండ్‌గా పెట్టింది.

చివరకు 196 మంది మినహా మిగిలినవారంతా విధుల్లో చేరారు. వీరిని కూడా డ్యూటీలో చేర్చుకోవాల్సిందిగా మజ్లిస్ పార్టీకి చెందిన మలక్‌పేట ఎమ్మెల్యే బలాలా చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు సచివాలయంలో మంగళవారం జరిగిన చర్చల సందర్భంగా సానుకూల నిర్ణయం తీసుకున్నారు. తిరిగి వీరిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మరోసారి అకారణంగా విధులకు గైర్హాజరు కావద్దని, రిపీట్ అయినట్లయితే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Read more:

Komatireddy Venkat Reddy : బర్త్ డే వేళ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పాలనలో నైజాంను మించిన సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed