- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుతి లేని బీజేపీ.. మతి లేని కాంగ్రెస్: మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: ధరణి పోర్టల్ విషయంలో బీజేపీ పూటకో మాట, నోటికో మాట మాట్లాడుతోందని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని నాగర్ కర్నూల్ సభలో జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మంత్రి సోమవారం కౌంటర్ ఇచ్చారు. ధరణి విషయంలో గల్లీ బీజేపీ నాయకులు ఒకటి చెప్తే, ఢిల్లీ నాయకులు ఇంకొకటి చెప్తారని అన్నారు. ధరణిని రద్దు చేయబోమని మొన్న రాష్ట్ర నాయకులు అంటే, రద్దు చేస్తామని నిన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అన్నాడని ఇది బీజేపీ రెండు నాలుకల ధోరణికి ఇది మరొక నిదర్శనమని ధ్వజమెత్తారు.
బీజేపీ పార్టీలో నేతల మధ్య సుతి కలవదు, ఒకరి మాట మరొకరు వినరని విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై కూడా మంత్రి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ధరణి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, గుడ్డిగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితి సుతి లేని బీజేపీ.. మతి లేని కాంగ్రెస్ అన్నట్లుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి :
BRS జలగల్లారా.. ఇంకెంత కాలం ప్రజల రక్తాన్ని పీల్చి బలుస్తారు: షర్మిల తీవ్ర విమర్శలు