- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటమి బాధలో ఉన్న బీఆర్ఎస్‌కు మరో దెబ్బ.. పదేళ్ల ఫ్రెండ్ షిప్‌కు ‘MIM’ కటీఫ్..?
దిశ, తెలంగాణ బ్యూరో: పదేండ్లుగా బీఆర్ఎస్‌తో కొనసాగించిన మైత్రికి మజ్లిస్ పార్టీ ఫుల్‌స్టాప్ పెట్టేలా కనిపిస్తున్నదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు పతంగి పార్టీ ప్రయత్నాలు చేస్తున్నదనే చర్చలూ నడుస్తున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బర్ బాధ్యతలు చేపట్టడంతోనే కాంగ్రెస్, మజ్లిస్ స్నేహానికి బీజం పడిందనే వాదనలూ లేకపోలేదు. అందుకు కొనసాగింపుగానే సెక్రటేరియట్‌లో ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కావడం వీటికి మరింత బలం చేకూర్చినట్టయింది. గ్రేటర్ హైదరాబాద్‌పై మంగళవారం సీఎం నిర్వహించిన రివ్యూకు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విపక్షానికి చెందిన సభ్యులతో సమావేశం కావడం ఇదే ఫస్ట్ టైం. ఒక వేళ బీఆర్ఎస్‌తో మజ్లిస్ ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేస్తున్నట్టయితే.. రివ్యూ మీటింగ్‌కు బీఆర్ఎస్ సభ్యులు రానుందున తాము సైతం రాలేమని తిరస్కరించే వారు కదా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికార పార్టీకి దగ్గర కావడానికే పతంగి పార్టీ సభ్యులు రివ్యూకు వచ్చారనే చర్చ మొదలైంది. సెక్రటేరియట్‌కు వచ్చే ముందు అక్బరుద్దీన్ యశోదలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సమయంలోనే తమ రాజకీయ నిర్ణయాన్ని ఆయనకు చెప్పి ఉంటారేమోనని చర్చ జరుగుతున్నది.
పదేండ్ల ఫ్రెండ్‌ఫిప్‌కు రాం రాం..?
రాష్ట్ర ఏర్పాటు నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు మజ్లీస్, బీఆర్ఎస్ మధ్య మంచి స్నేహం కొనసాగింది. ప్రతి ఎన్నికల్లో రెండు పార్టీలు అవగాహనతోనే పోటీ చేశాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారులోని మున్సిపల్ కార్పొరేషన్లు, నిజామాబాద్ మేయర్ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుని పదవులను పంచుకున్నాయి. 2014లో గులాబీ పార్టీ మొదటి సారి అధికారం చేపట్టిన తర్వాత మజ్లిస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవులు కూడా దక్కాయి.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇరుపార్టీల మధ్య ఫ్రెండ్‌ఫిప్ కొనసాగుతున్నదని అటు కేసీఆర్, ఇటు ఒవైసీ సోదరులు సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రకటనలు చేశారు. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ రాకుంటే మజ్లిస్ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు లెక్కలు వేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రావడంతో ఒవైసీ సోదరుల కాంగ్రెస్‌తో స్నేహంగా ఉండేందుకు మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
అసెంబ్లీలో 72కు పెరగనున్న కాంగ్రెస్ బలం..?
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించింది. మిత్రపక్షమైన సీపీఐ 1 స్థానంలో గెలుపొందింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా మారే చాన్స్ ఉన్నదనే టాక్ వినిపిస్తున్నది. అదే జరిగితే ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ బలం 72కు చేరనుంది. ఈ స్నేహం అటు కాంగ్రెస్‌కు, ఇటు మజ్లీస్ పార్టీకి అవసరమనే అభిప్రాయంతో ఆ రెండు పార్టీలు ఉన్నట్టు టాక్.
అందుకే ఉమ్మడి రాష్ట్రంలో చెదిరిన వీరి స్నేహం మళ్లీ చిగురిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీలో ఏమైన క్లిష్ట పరిస్థితులు వస్తే ప్రభుత్వానికి మజ్లిస్ సపోర్ట్‌గా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. అలాగే అభివృద్ధి కోసం మజ్లిస్ లీడర్ల డిమాండ్లను తీర్చాల్సిన బాధ్యత సైతం సర్కారుపై ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.