తక్షణమే ఆయన బెయిల్‌ను రద్దు చేయండి.. సీపీని కలిసిన ఎంఐఎం చీఫ్ అసద్

by Gantepaka Srikanth |
Asaduddin Owaisi Says He will not Support any law Mandating Only 2 Child
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌(Hyderabad Police Commissioner CV Anand)ను ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) కలిశారు. శనివారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి యతి నరసింహానంద్(Yati Narasimhanand) సరస్వతిపై సీపీకి కంప్లైంట్ చేశారు. గతంలో యతి నరసింహానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జైలుకి వెళ్లి కండీషన్ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆయన బెయిల్‌ను తక్షణమే రద్దు చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియోలను కూడా సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయించాలని కోరారు. ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అని అన్నారు. ఆ వ్యాఖ్యలు ముస్లింలను తీవ్రంగా బాధించాయని అన్నారు. ప్రస్తుతం తమ కంప్లైంట్‌పై కమిషనర్ సానుకూలంగా స్పందించారని ఒవైసీ చెప్పారు.

Advertisement

Next Story