రకుల్, సమంత పేర్లు ప్రస్తావిస్తూ.. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-03-31 10:19:30.0  )
రకుల్, సమంత పేర్లు ప్రస్తావిస్తూ.. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఇద్దరు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే రూ.100 కోట్ల పరువునష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. తాజాగా.. ఈ నోటీసులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వంద కోట్లు ఇచ్చి కేటీఆర్‌ను నోటికొచ్చినట్లు తిట్టొ్చ్చా అని ప్రశ్నించారు. కేటీఆర్ పరువు విలువ రూ.100 కోట్లు అని ఎలా నిర్ధారించారని ఎద్దేవా చేశారు. ఇది ఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సంతకం పెట్టినట్లా?, లేకపోతే సమంత సీరిస్‌కు అగ్రిమెంట్ చేసుకున్నట్లా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read where:

ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్న కాజల్.. అలా హింసించారంటూ కామెంట్స్!

Advertisement

Next Story

Most Viewed