- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటరు జాబితాలో తప్పులకు తావివ్వం: అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి
దిశ, మేడ్చల్ ప్రతినిధి: ఓటరు జాబితాలో తప్పులకు తావివ్వకుండా పకడ్బందీగా రూపొందిస్తున్నట్లు మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టీ. రవికిరణ్ లు జిల్లా కలెక్టర్లతో ఓటర్ జాబితాలో పీఎస్ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, బూత్ లెవెల్ అధికారుల నియామకం అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కీసర ఆర్డీవో రవిలు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కి వివరించారు. జాబితాలో ఒకే ఓటర్ ఫోటోలు, వివరాలు రెండుమార్లు ప్రచురించిన వాటిని పరిశీలించి తొలిగిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయో లేదో పరిశీలించి, ఏమాత్రం లోపాలకు తావులేకండా అప్డేట్ చేస్తామని వివరించారు.